బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మునిసిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డులో నూతన సీసీ రోడ్డు, మురికి కాలువ నిర్మాణానికి ఆమె కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.