కన్నేపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

261பார்த்தது
కన్నేపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు మంగళవారం కన్నేపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టకూడదని వారి ధాన్యం కొనుగోలు చేయకూడదని నిర్ధాక్షిణ్యంగా చెబుతున్నందున రైతులు యాసంగిలో వేయకుండా ప్రత్మమ్నయ పంటలు వేసుకోవాలని సూచించారు.

రైతుల కోసం సీఎం కేసిఆర్ ఆలోచించి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో అందరిని సమన్వయం చేసుకుని నల్లబ్యాడ్జిలు దరించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రంగరావు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జిల్లెల్ల మహేష్ గౌడ్, సర్పంచ్ లు సురేఖ-రాజయ్య ప్రభాకర్, లక్ష్మీ-లింగయ్య, మండల యువజన అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி