బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి భజన బృందం సభ్యులు పేదింటి యువతి వివాహానికి చేయూతనందించారు. బెల్లంపల్లి మండలం పెద్దదుబ్బ గ్రామానికి చెందిన భాగ్య, యాదగిరి కూతురు లావణ్య వివాహానికి పుస్తె, మెట్టలు అందజేశారు. బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచందర్ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.