రైల్వే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఏకైక సంఘం తమదేనని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రెటరీ రవీందర్ అన్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే విభాగాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీర్ఘకాలం నుంచి రైల్వే కార్మికుల సమస్యలు అపరిషృతంగా ఉంటున్నాయని తెలిపారు. రైల్వే కార్మిక సమస్యలపై పోరాడుతున్న యూనియన్ ను ఆదరించాలని కోరారు.