ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ స్పష్టం చేశారు. గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్లో పోలీసులు కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించారు. తగిన ద్రువపత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్సై మహేందర్, తాళ్ల గురజాల ఎస్సై రమేష్, నెన్నెల ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు.