సర్కార్ నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయాలు జరపాలని సన్న, దొడ్డు రకాలకు వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి, దుబ్బపల్లి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సన్న రకాలకు 500 మద్దతు లభిస్తుందన్నారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారన్నారు.