సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఖాళీలను స్పాట్ అడ్మిషన్లతో వెంటనే భర్తీ చేసేందుకు కలెక్టరేట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. హెల్ప్ డెస్క్ ను సంప్రదిస్తే సంబంధిత పాఠశాలలకు పంపించి స్పాట్ అడ్మిషన్ ఇప్పిస్తారని, ఖాళీ సీట్లన్నీ భర్తీ అయ్యే వరకు డెస్క్ కొనసాగించాలని సందేహాలు, ఖాళీల వివరాలకు జీసీడిఓ సుబ్బలక్ష్మిని సంప్రదించాలన్నారు.