రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విజయోత్సవాలు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఈనెల 14 నుండి డిసెంబర్ 7 వరకు ఉత్సవాలు జరిపించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కళ బృందాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈనెల 20న నారాయణపేట పట్టణంలోని అంజనా ఫంక్షన్ హాలులో విజయోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సోమవారం చెప్పారు.