కల్వకుర్తి: కుల గణనకు సహకరించాలి: ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ కుల గణన సర్వేకు నియమించిన ఎన్యుమరేటర్లకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుల గణన సర్వేపై అవగాహన నిర్వహించారు. రాష్ట్రంలోని సకల జనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.