నాగర్ కర్నూల్: అయోడిన్ ఉప్పుతో ఆరోగ్యం
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో తగినంత అయోడిన్ ఉప్పు వాడాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. నాగర్ కర్నూల్ లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రపంచ అయోడిన్ లోపం రుగ్మతల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లల మానసిక వికాసానికి, శారీరక పెరుగుదలకు అయోడిన్ అత్యవసరమన్నారు. అయోడిన్ ఉప్పు వలన కలిగే ప్రయోజనాలపై విద్యార్థినులు తల్లిదండ్రులకు వివరించాలన్నారు.