రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి చెప్పారు. సోమవారం కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు.