వరి ధాన్యం అమ్మడానికి వచ్చిన రైతులకు కొనుగోలు సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ వడ్ల కొనుగోలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సీతారామారావు సోమవారం సూచించారు. ఉప్పునుంతల మండలంలోని మొలగర వద్ద ఏర్పాటు చేసిన సింగిల్ విండో గోదాం సెంటర్ ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర 2320, సన్నవడ్లకు ప్రకటించిన 500 రూపాయల బోనస్ నగదు రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయన్నారు.