కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష నిర్వహించకుండా రెగ్యులర్ చేయాలని మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పసియోద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. 2023లో 7716 జీవోను జారీ చేసి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించి సమస్యను పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకున్నదని, నేటికీ ఆ కమిటీ ఎప్పుడూ కూడా సమావేశం కాలేదని, దీంతో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.