మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అశోక్ బాబు హెచ్చరించారు. గురువారం మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.