సర్పంచుల పెండింగ్ బిల్లుల సాధనకై చలో హైదరాబాద్ ప్రత్యేక సమావేశానికి బయలుదేరుతున్న మాజీ సర్పంచులను సోమవారం జడ్చర్ల పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ అధ్యక్షులు ప్రణీల్ చందర్ మాట్లాడుతూ. పెండింగ్ బిల్లులు అడిగితే. అరెస్టులా.? 1500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.