కార్తీక శనివారం సందర్భంగా తెల్లవారుజామున అయిజ పట్టణంలోని కట్ట కింద తిమ్మప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజామున మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాన్ని వెలిగించి, స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో కనిపించారు.