మహబూబ్ నగర్: పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సీసీఐ మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నుంచి జిన్నింగ్ మిల్లులను నోట్ పైడ్ చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు, 8% నుంచి 12% తేమ ఉంటేనే మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ మార్కెటింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.