మదనాపురం: వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మదనాపురం మండలంలోని దంతనూరు శంకరమ్మలో సోమవారం పిఎసిఎస్ కొత్తకోట ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ పిఏసీఎస్ వైస్ చైర్మన్ చీర్ల శ్రీనివాసులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులు సన్న రకాలను 14% తేమతో దొడ్డు రకాలను 17% తేమతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సన్న రకాలకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ 500 రూపాయలు రైతులు పొందాలన్నారు.