తెలంగాణ రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వే పూర్తికాగానే డేటాను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన దేశానికి దిక్సూచిగా నిలవబోతోందని చెప్పారు.