ఇల్లెందు పట్టణంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన యువతి(23) అదే ఏరియాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఈ నెల 4న బయటకు వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోగా, బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ కనిపించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులకు సోమవారం పిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో సీఐ సత్యనారాయణ సోమవారం కేసు నమోదు చేశారు.