పినపాక మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం ఏడుగురు లబ్ధిదారులకు రూ. 3. 25 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.