పినపాక: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త

62பார்த்தது
పినపాక: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ మోసాలపై శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ గోపాలరావుపేట గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు చరవాణిలో గాని, ప్రత్యక్షంగా గాని మీ బ్యాంక్ వివరాలు, ఆధార్ వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி