మణుగూరులో వీధి కుక్కలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయని సామాజిక కార్యకర్త కర్నే బాబురావు అన్నారు. శనివారం మండల తహశీల్దార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల వీధి కుక్కలు నలుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని అన్నారు. రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.