మణుగూరు మండలం బాయి కూనవరం సమగ్ర కుటుంబ సర్వేను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని వారి ఇంటికి స్టిక్కర్ అతికించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కర్గే ఆలోచన నుంచి వచ్చిందే కుల గణన అని అన్నారు. కుల గణన ద్వారా ప్రభుత్వాల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండాలని అన్నారు.