మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వారి కదలికపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ రోహిల రాజు సూచించారు. కరకగూడెం, పినపాక మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ లను శుక్రవారం పరిశీలించారు. పోలీస్ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించి, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా చేయాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ సిబ్బంది తమ దృష్టికి తీసుకోవలని అన్నారు.