యువతి అదృశ్యం ఘటనలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం మండలానికి చెందిన యువతి(22) ఈనెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాజేశ్ కేసు నమోదు నమోదు చేశారు.