అశ్వాపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను, బ్రెడ్లను పంపిణీ చేశారు.