క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే వారికి పోలీసు శాఖలో గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేయడంతో పాటు, ఆయా కేసుల్లో నిందితులకు సత్వరం శిక్ష పడేలా కృషిచేసిన సీఐ నాగరాజు రెడ్డి, ఏఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ అధికారి సుధీర్ లు ఇటీవల డీజీపీ చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ తన కార్యాలయంలో సోమవారం అభినందించారు.