విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ వసతిగృహాల అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. భోజనం నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మతో కలిసి సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.