కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి దంపతులు పారిశుద్ధ్య కార్మికులను ఇంటికి పిలిచి గురువారం వారికి నూతన వస్త్రాలు, పండుగ ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమన్నారు. పండగ సందర్భంగా సహాయం చేసినందుకు పారిశుద్ధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.