వ్యక్తిపై దాడిచేసి గాయపరిచిన నిందితుడిని బుధవారం రిమాండ్ కు తరలించినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. రుద్రంపూర్ తిలక్ నగర్ కి చెందిన పి. మహేందర్ పాతకక్షతో రాంపురం గ్రామానికి చెందిన పులిచర్ల రామకృష్ణ దాడిచేశాడు. ఇంటి మీదకు వచ్చి దాడిచేసిన ఘటనలో మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా రామకృష్ణను రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు