భద్రాచలంలో క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో వైద్య సిబ్బంది పనితీరు మార్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని పేషంట్లు వాపోతున్నారు. 9 గంటలకు వచ్చి 4 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వారు ఇక్కడ మాత్రం ఉదయం పదిన్నర కూడా వైద్య సిబ్బంది రాకుండా మధ్యాహ్నం రెండు గంటలకే వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వైద్య సిబ్బంది పని తీరుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేషంట్లు కోరుకుంటున్నారు.