భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే సూచించారు.