ఇసుక ర్యాంపుల నిర్వహణతో ఆదివాసి గిరిజన మహిళలకు జీవనోపాధి లభిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జిఎం జి. శంకర్రావు అన్నారు. బుధవారం మండలంలోని నందుల చెలక ఇసుక ర్యాంపును ఆయన తనిఖీ చేశారు. ఆదివాసి గిరిజన మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పెంపొందించుకొని తమ గ్రామాలలోని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పొందడానికి ఆ గ్రామంలోని గిరిజనులకే అవకాశం కల్పించామని ఆయన అన్నారు.