దుమ్ముగూడెం: చికిత్స పొందుతూ యువకుడు మృతి

62பார்த்தது
దుమ్ముగూడెం: చికిత్స పొందుతూ యువకుడు మృతి
దుమ్ముగూడెంలో ఈనెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణరావుపేటకు చెందిన పాయం జంపయ్య, కొమరం వీర్రాజు కలసి ద్విచక్రవాహనంపై భద్రాచలం వెళ్లి అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జంపయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వీర్రాజుకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీర్రాజు మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி