కులగణన పేరిట కళ్యాపన మినహా నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి. సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. బుధవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్లో ఐద్వా మండల కార్యదర్శి పొడుపు కంటి సమ్మక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కతోవ పట్టిస్తున్నారని అన్నారు.