రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో మత్స్యకార సొసైటీ సంఘాలకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం చర్ల మండలం చిన్నమిడిసిలేరు ప్రాజెక్టులో మధ్య సొసైటీ సభ్యులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.