సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. శనివారం పట్టణంలో జరిగిన కుటుంబ సర్వేలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి వివరాలు సేకరించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం సులభతరం అవుతుందని అన్నారు. సంబంధిత పత్రాలతో సర్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.