మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107 వ జయంతి వేడుకలను భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.