రైతు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గురువారం అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ వద్ద నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.