కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొత్తపల్లి వెంకటలక్ష్మీ చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. అనిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. కంటి పరీక్షలకు 28 మంది హాజరయ్యారు. వారిలో 11 మందికి శస్త్రచికిత్స అవసరమని, ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఆప్తమాలజిస్ట్ శ్రీనాథ్, ఐక్యాంప్ ఇన్ ఛార్జ్ గోపి, తదితరులున్నారు.