వాంకిడి మండలం దాబా గ్రామంలో విద్యార్థిని శైలజ మృతదేహంతో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్ నోరు జారారు. 'మీ అమ్మాయి మరణించింది మీకే ఇబ్బంది అవుతుంది.. ఆమె వచ్చింది మళ్లీ వెళ్లిపోతాది' అని ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 1500 కి. మీ దూరం నుంచి వచ్చి సేవ చేస్తున్నామన్నారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆయనపై ఫైర్ అయ్యారు.