వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆసిఫాబాద్ డిఎస్పి సదయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రశాంత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేస్తున్న సందర్భంలో కంటైనర్ వాహనంలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా కంటైనర్ వాహనంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు విక్రయించేందుకు 14 పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.