కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయు కొమరంభీం జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక, ప్రజా సంఘాల, నాయకులు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను కార్యక్రమానికి బుధవారం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణుగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.