కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదరికం పెరుగుతుండగా.. సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. వైరాలో మంగళవారం నిర్వహించిన పట్టణ మహాసభలో మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను హరించి మనవాదాన్ని ముందుకు తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఉద్యమాలు చేపట్టాలని పేర్కోన్నారు.