కారేపల్లి బస్టాండ్ సెంటర్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) అనుబంధ మాధారం డోలమైట్ మైన్స్ యాజమాన్యం స్వచ్ఛతా మిషన్లో భాగంగా సీఎస్ఆర్ నిధులు రూ. 6.75 లక్షలతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ పనులపై వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ సెంటర్ లో ప్రజా మరుగుదొడ్లు నిర్మించటం అభినందనీయమన్నారు.