ఆర్టిజన్ కార్మికులకు మరియు విద్యుత్ ఉద్యోగులకు అందరికి పిఆర్సి వెంటనే అమలు చేయాలిని హెచ్ -82 రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ ఆఫీసు ముందు బోజన విరామ ధర్నా చేయడం జరిగింది.
విద్యుత్ ఉద్యోగులకు పి ఆర్ సి ని జాప్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని, ప్రతి సబ్ స్టేషన్ లో ఇద్దరు చొప్పున ఆపరేటర్ల తొ విధులు నిర్వహించడం వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నామని నలుగురు ఆపరేటర్లు నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డివిజన్ విద్యుత్ అర్టిజన్ కార్మికులు మరియు హెచ్-82 యూనియన్ నాయకులు పాల్గొన్నారు.