నేలకొండపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి తహశీల్దార్ మాణిక్ రావు ఫిర్యాదులను స్వీకరించారు. కాగా, మండల కాంగ్రెస్ నాయకులు రాంబాబు ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినప్పటికి ఆ నిబంధనలను ప్రైవేటు విద్యాసంస్థలు పాటించడం లేదని చెప్పారు.