నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురంలో మధుకాన్ షుగర్, పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యాన ఈ ఏడాదికి చెరుకు టన్నుకు మద్దతు ధర రూ. 3, 400గా నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల్లో కరపత్రాల ద్వారా శుక్రవారం ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ డిసెంబర్ 7న చెరుకు క్రషింగ్ ప్రారంభించనుండగా, గత ఏడాదితో పోలిస్తే టన్నుకు రూ. 210 ధర పెంచినట్లు తెలిపారు.