ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఐఏఎస్ శనివారం మధిర మండలానికి విచ్చేసిన సందర్భంగా తహశీల్దార్ రాంబాబు వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మధిరలో జరుగుతున్న కుల గణన సర్వే గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.